4, నవంబర్ 2014, మంగళవారం

వివేచన - 15. పొగడ నిమ్ము నన్ను పుడమి నున్నన్నాళ్ళు


పొగడుదునో నిన్ను జగదధీశ్వరుడహో
నా స్వామి యనుచు నానందముగను

పొగడుదునో నిన్ను పురుషోత్తముడయా
నా స్వామి యనుచు నానందముగను

పొగడుదునో నిన్ను భూరికృపాళువు
నా స్వామి యనుచు నానందముగను

పొగడుదునో నిన్ను మోక్షవితరణుడు
నా స్వామి యనుచు నానందముగను

పొగడికలకు నీవు పొంగకుండిన నేమి
పొగడి సంతసించు బుధ్ధి నాది
పొగడ నిమ్ము నన్ను పుడమి నున్నన్నాళ్ళు
పొగడదగిన నిన్నె పొలుపు మీఱ


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.