3, నవంబర్ 2014, సోమవారం

వివేచన - 11. ఇతరులను గూర్చి చింతింప నేల నీకు
అన్ని వేళల నీకు నండయై యుండెడు
    వాని నర్చింపగా వలయు నీవు

అన్ని చోటుల నీకు నండయై యుండెడి
    వాని నర్చింపగా వలయు నీవు

అన్ని భవముల నీకు నండయై యుండెడి
    వాని నర్చింపగా వలయు నీవు

అన్ని విధముల నీకు నండయై యుండెడి
    వాని నర్చింపగా వలయు నీవు

వాని కంటెను హితుడైన వాడు గలడె
వాడు నీవాడు పెఱ లట్టి వారు గాదు
వాని నీశ్వరు నర్చింప వలయు గాని
ఇతరులను గూర్చి చింతింప నేల నీకు


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.