27, మే 2014, మంగళవారం

రామకీర్తనలు - 19 రామ రామ యని నామము బలుకగ రాదో‌జనులారా


రామ రామ యని నామము బలుకగ రాదో జనులారా
కామితఫలదుని ఘనతను పొగడుట కాదో మీ వలన


సుజనుల కెపుడు సుఖము నొసంగే సూర్యవంశవిభుని
విజయపరంపర వీనులవిందుగ వినిపించగ రాదా
॥రామ రామ॥

నిరుపమగుణనిధి పరమాప్తుం డిది నిశ్చయమే కాదా
పరమాత్ముని సంభావించుటలో పరమసుఖము లేదా
॥రామ రామ॥

చతురాననశివశక్రసంస్తుతుని శరణు వేడ రాదా
మతిమంతులరై మోక్షప్రదునిపై మనసు నిలుప లేరా
॥రామ రామ॥వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.