16, మే 2013, గురువారం

పాహి రామప్రభో - 108

చం. పలత మాని రాము నెద చక్కగ నేను భజించు టెన్నడో
ఉపరతి నుండి శ్రీవిభు ననూనతపంబున గొల్చు టెన్నడో
తపము ఫలించి రామవిభు దర్శన మన్నది కల్గు టెన్నడో 
అపుడు భవాబ్ధి దాటి పరమాత్ముని చేరెద నిశ్చయంబుగన్

(వ్రాసిన తేదీ: 2013-5-8)4 వ్యాఖ్యలు:

 1. శ్యామలీయం వారూ...

  నిశ్చయంబుగన్ చపలత ఉపరతి యే ???

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. జిలేబీగారు, మీ సందేహం నాకు అర్థం కాలేదు. మరిన్ని మాటలలో వ్యక్తం చేస్తే సందేహం తీర్చగలనని భావిస్తున్నాను.

   తొలగించు
 2. అబ్బా ఆశ అప్పడం వడ.. అంత త్వరగా భవాబ్ది దాటేయడం కుదిరితే ఇంకేం? ఆష్టకష్టాలు పడాలి. రాముడు తప్ప ఇంకెవరూ మనసులోకి రాకూడదు. "నీవే తప్ప ... పరంబెరుగన్" అనే స్థితి రావాలి. అప్పుడు నను పాలింపగ నడచీ వచ్చితివా అనుకోవచ్చు. అప్పటిదాకా అలా రామనామం చేయడమే.

  అప్పుడు నీకేమి కావాలోయ్ అని చిద్విలాసంగా ఆయన అడిగితే.. అప్పుడు తెలుస్తుంది ఏమికావాలో. ధృవుడు చెప్పేడుగా ఏమికావాలో? నచికేతుడు కూడా చెప్పేడు. ఇన్ని కష్టాలు పడ్డాక ఒక మహాత్ముణ్ణి అడిగేరుట ఒకాయన. అయ్యా గురు సేవ (అంటే పరమాత్మ సాక్షాత్కారం ముందు చేసిన సేవ) మీకు నచ్చిందా లేకపోతే పరమాత్మే మీకు నచ్చాడా అని. గురుసేవ త్రాసుకు ఒక వైపు, మిగతా ప్రపంచం, పరమాత్మ అన్నీ రెండో వేపు వేస్తే, గురుసేవే బరువు బాగా తూగుతుంది. ఎన్ని కష్టాలు పడినా అదే ఎప్పటికీ కావాల్సింది అని వచ్చిందిట సమాధానం.

  అంచేత మొదటి మూడు లైన్లూ నాలుగో లైన్ కన్నా ఎంటో మహత్తరమైనవి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సంతోషమండీ 75% మార్కులు వేసి పద్యాన్ని పాస్ చేసారు.
   ఇక పోతే, ఈ పద్యంలో‌ ప్రస్తావించబడ్దది అనూనతపం. కామ్యార్థతపం కాదు. వెలితిలేని తప్పస్సు అనేది నీవే తప్ప నితఃపరం బెరుగననే స్థితిలో చేసేదే‌కాని తదితరం యేమీ‌ కాదు. జీవుడి యందున్న అవిద్య దగ్థబీజం అయేదాకా తపో వ్యవహారం కామ్యార్థంగానే తపస్సు ఉంటుంది. అటువంటి సగుణోపాసనపూర్వక తపస్సుల ఫలితం నశ్వరమే అవుతుంది కాబట్టి మీరన్నట్లు అది శాశ్వతమైన కైవల్యపదం కాదు. అవిద్య దగ్థబీజం అయేదాకా కేవలత్వం కేవలం వాగాడంబరమే కాని నిష్కళంకమైన కోరిక కాదు.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.