6, మే 2013, సోమవారం

పాహి రామప్రభో - 099

ఉ. జానువు లంటు బాహువుల చక్కని చామనచాయ మే స్మే
రాననమందు శ్రోత్రముల నంటెడు తామర లట్టి కన్నులన్
జ్ఞానవిలాసరూప మగు చల్లని నవ్వున శుధ్ధమోక్షల
క్ష్మీనిజవాసమైన పదసీల రామయతండ్రి యొప్పెడున్

(వ్రాసిన తేదీ: 2013-5-3)

3 వ్యాఖ్యలు:

 1. ఇంకొక్క పద్యం. పాహిరామశతకం.
  అదృష్టవంతులు మీరు, మమ్మల్ని కూడా ధన్యుల్ని చేసారు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చాలా మటుక్కి పోతన కూడా ఇలాగే రాసాడు. నల్లని వాడు... కడు విప్పని వక్షము వాడు ... (తప్పులు మన్నించ గలరు). కానీ చివర్లో .. ఇచ్చు మా కభీష్టముల్.. అని ముగుస్తుంది. మీ పద్యంలో కొంచెం తేడా.

  కొనసాగించండి. వంద అయిపోయాయి కదా అని ఆప వద్దు. ప్రవాహం ఎంతకాలం వస్తే అన్నీ రాయడం మంచిది. నిజంగా ఆగినప్పుడు, ఈ పద్యాలన్నీ ప్రతి పదార్ధంతో ఒక పుస్తకం వేసి పీ.డి. ఎఫ్ రూపంలో అందించవచ్చు. ప్రచురించవచ్చు కూడా.

  అదృష్టవంతులు మీరు. భగవంతుడు కరుణారస ప్రేమ మీ మీద ప్రవహిస్తూ ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. D.G గారూ, మనోహర్ గారూ
  యెన్నాళ్ళపాటు వ్రాయగలనో అన్నాళ్ళు వ్రాస్తాను. భగవదనుగ్రహం ప్రకారం అంతా నడుస్తుంది శుభంగా. నూరవపద్యంతో‌ శతకం‌ అవుతుంది. క్రికెట్‌లో నూరునుండి యెంతైనా శతకమే అది మరొక నూరు పూర్తయేదాకా. పద్యాలలోనూ‌ అంతే. చూదాం యెంతవరకూ రామానుగ్రహం వ్రాయిస్తుందో. ఇక ప్రచురణ అంటారా, నా కంత శక్తి ఉందా అని అనుమానం. ఏమో రాముడి సంకల్పం యెలా ఉంటే అలా జరుగుగాక.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.