3, మే 2013, శుక్రవారం

పాహి రామప్రభో -096

శా. భద్రాద్రీశ్వర రామచంద్ర శుభదా వాత్సల్యముం జూపి యీ
క్షుద్రుం పాపవిమోహమూర్ఛితు దయాశూరుండవై బ్రోచుటన్
ఛిద్రంబయ్యెను సర్వపాపములు నా చిత్తంబులో దేవరా
ముద్రింపబడె మీదు మూర్తి యిక షడూర్ముల్ దీరె శాంతించితిన్ 

(వ్రాసిన తేదీ: 2013-4-29)

5 వ్యాఖ్యలు:


 1. 'రామచంద్ర ప్రభువా ' అంటే, ఏదో జేహోవా అన్నట్టు ఉందండీ


  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. >> దయాశూరుండవై బ్రోచితే
  When I read this, I sense it as a "if loop". :-) Only if he does that, then the next two lines will apply :-)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. No sir. There is no if conditional programmed into this poem on the second line to restrict the applicability of the state described by the remaining two lines. The word బ్రోచితే here means the affirmative. Kindly observe the usage the same word in identical context in the following examples:

   దయాశాలివై జూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే.... (శ్రీఆంజనేయ దండకం)
   కరుణా కటాక్షంబున జూచితే దాతవై బ్రోచితే, తొల్లి షణ్ముఖుండవై ... (శ్రీషణ్ముఖ దండకం)

   ఇక్కడ బ్రోచితే (బ్రోచితివికదా) నిలచితే (నిలచితివికదా)... అని

   తొలగించు
  2. ఇతరులకూ యీ బ్రోచితే అన్న ప్రయోగం సందేహం కల్గించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మార్చటం జరిగింది

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.