30, ఏప్రిల్ 2013, మంగళవారం

పాహి రామప్రభో - 093

ఉ. కామినులందు కొందరును కాంచనరత్నములందు కొందరున్
భూములయందు కొందరును భోగవినోదములందు కొందరున్
కామన గల్గు వార లధికంబుగ నిధ్ధర నుండ కొద్దిమంది శ్రీ
రామునియందు చిత్తమును లగ్నమొనర్చెద రెంత ధన్యులో

(వ్రాసిన తేదీ: 2013-4-27)


5 వ్యాఖ్యలు:

 1. ఇంకా నయం...

  బ్లాగు రాయుటయందు కొందరున్, కామెంటుచుండు కొందరున్ కోండొకచో అజ్ఞాతులున్ .. అన్నారు కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఉ. కొందరు బ్లాగు వ్రాయుగను కొందరు వాటిని పల్కరించగన్
   కొందరు బ్లాగులం జదివి కొద్దియొ గొప్పయొ వ్యాఖ్యలుంచగన్
   కొందరు సందు చూచుకొని కూడని వ్రాతల గోలచేయుగన్
   కొందరు రామ రామ యని కొంచెము వ్రాయుచు నుందు రెప్పుడున్

   సరేనాండీ?

   తొలగించు
  2. లోకరీతిని చాలా చక్కగా వర్ణించారు. ఈ కాలపు పిల్లలు, కొందరు ఫేస్బుక్కుల లైకులందును, ట్విట్టరు ట్వీటులందును, ఇంకొందరు ఫోర్ స్క్వేర్ గోడల అవాస్తవిక దారులం తప్పిపోయిరే.

   తొలగించు
  3. విశ్వనాథ్ మీ బ్లాగు ఖాళీగా ఉంచవద్దు రాస్తూ ఉంటే బాగుంటుంది.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.