29, ఏప్రిల్ 2013, సోమవారం

పాహి రామప్రభో -092

మ. కనుమా నే నొనరించినట్టి పాపము లసంఖ్యాకంబులై దోచి చే
సిన పుణ్యంబుల సంఖ్య చెప్పుమనగా సిగ్గిల్లగా నాయెనో
జననాధోత్తమ యెట్టివాని యినన్ సంరక్ష సేయంగ నీ
నగా గల్గు టెరింగి చేరితిని ని న్నాపన్నుడన్ రాఘవా
 
(వ్రాసిన తేదీ: 2013-4-26)
   

1 వ్యాఖ్య:


  1. శుభం !

    ఇక 'అష్టాంగ యోగమే' బాకీ పాహీ రామప్రభో శతానికి !

    జిలేబి

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.