23, ఏప్రిల్ 2013, మంగళవారం

పాహి రామప్రభో - 086

ఉ. చిన్మయమూర్తి వీవు నిను చేరగ నోడు నవిద్య నే ననన్
మృణ్మయమూర్తి నీ బ్రతుకు మీదికి క్రిందికిగా నవిద్యతో
తన్మయమై భ్రమించు వరదా దయచూపితి వయ్య రాఘవా
మన్మన మింక నీ దగుట మాడె నవిద్యయు చాల ధన్యుడన్

(వ్రాసిన తేదీ: 2013-4-19)

2 వ్యాఖ్యలు:

 1. శంకర భగవత్పాదుల శివానంద లహరి శ్లోకం గుర్తుకు తెప్పించారు

  కరస్థే హేమాద్రౌ గిరిశ నికటస్థే ధనపతౌ
  గృహస్తే స్వర్భుజామర సురభి చింతామణి గణే
  శిరస్థౌ శీతాంసౌ చరణయుగళస్తే అఖిలసుభౌ
  కమర్దం దాస్యే జహం భవతు భవదర్ధం మమ మనః

  అన్నీ ఉన్న వాడివి నీకు ఇచ్చేది ఏమీ కనిపించదు అంచేత నా మనస్సే తీసుకో అనడం ఎంత ఉదాత్తమైన భావనో చూడండి.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.