18, ఏప్రిల్ 2013, గురువారం

పాహి రామప్రభో - 081

. సుమధురభాషణాచతుర సూర్యకులాన్వయరత్నదీప దై
త్యమధనసత్కళానిపుణ ధర్మప్రవర్తక సత్యశీ
ర్వమునిజనాంతరంగపరిభావితసుందరదివ్యరూప జ్ఞా
నమయవిలాస చిన్మయ అనాధజనైకశరణ్య రాఘవా 

(వ్రాసిన తేదీ: 2013-4-17)

4 వ్యాఖ్యలు:

 1. సుందర దివ్య రూప అంటే గుర్తు వచ్చింది... ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన సాయి సచ్చరిత్ర పుస్తకంలో ఇలాగ రాసారు. "రాముడ్ని చూసి పురుషులు కూడా పరవశులయ్యేవారుట. కృష్ణుణ్ణి చూస్తే ఒళ్ళు తెలిసేది కాదుట ఎవరికీ." నలుపులో కూడా అంత అందం ఉంటుందా అనిపించదూ? :-)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామల మూర్తయే
   పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం

   అని మంగళాశాసనం కదా.

   చరిత్రలో అత్యంతసౌందర్యవంతులుగా ప్రసిథ్తికి వచ్చిన వారిలో చాలామంది నల్లని వారేనటండీ.
   రామకృష్ణులు సరేసరి.
   భారతకథానాయకి ద్రౌపదీ దేవికూడా నల్లనమ్మే. క్లియపాత్రా నల్లగానే‌ ఉండేదట.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.