15, ఏప్రిల్ 2013, సోమవారం

పాహి రామప్రభో - 078

ఉ. మంచిది రామచంద్ర అసమాన పరాక్రమశాలివైన నిన్
వంచనచేయు రావణు నవశ్యము ద్రుంచితి నీదు భక్తులన్
వంచనచేయు నట్టి కలి వంకకు చూడ విదేటి న్యాయమో
ముంచిన తేల్చినన్ పరమ పూరుష భారము నీది రాఘవా

(వ్రాసిన తేదీ:  2013-4-15)

2 వ్యాఖ్యలు:

  1. కర్మ పరిపాకం కావొద్దుటండీ? కలియుగం మొదలై ఇంకా పదివేల ఏళ్ళు కాందే అప్పుడే కంగారు పడిపోతున్నారే రాముడు ఇటువైపు చూడట్లేదని? ముందుంది ముసళ్ళ పండగ. ఆయన చూస్తూనే ఉంటాడు, మనం చేసేది చేస్తూనే ఉంటాము. అప్పుడప్పుడు చూసి చూసి ఒక "తులసీ దాస్ ఎఫెక్ట్" చూపిస్తూ ఉంటాడు ఆయన. అంటే సిగ్గులేకుండా మనం చేసే పనులన్నింటినీ మన వాళ్ళ చేతే "ఛీ" అనిపించి మార్పు తీసుకొస్తాడు. తులసీ దాసుకి వాళ్ళావిడచేత చెప్పించేడు కదా, అలాగే. అక్కడ్నుంచి ఆయనదే భారం. కరి "నేను గెలవగలనూ" అనుకున్నంతకాలం ఆయన అలానే చూస్తూ ఉన్నాడు కదా? "నేను కాదు నువ్వే" అనే ఊహ వచ్చిన మరుక్షణంలో ఆయన వస్తాడు. ఎంతతోందరగా అంటే,

    "సిరికింజెప్పడు.." అంత తొందరగా..

    ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.