10, ఏప్రిల్ 2013, బుధవారం

పాహి రామప్రభో - 073

రాముని తలచిన తొలగును భయము 
రాముని తలచిన కలుగు నభయము
రాముని తలచిన కలుగును జయము
రాముని తలచిన  కలుగును యశము
రాముని తలచిన జరుగును శుభము 
రాముని తలచిన కలుగును  సుఖము
రాముని తలచిన తొలగును భవము
రాముని తలచిన కలుగును పరము


(వ్రాసిన తేదీ:  2013-2-13)


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.