2, ఏప్రిల్ 2013, మంగళవారం

పాహి రామప్రభో - 066

ఉ. ఈ నరజన్మ దొడ్డతన మేమని చెప్పగ వచ్చు ప్రీతిమై
పూని నరావతారములు పొల్పుగ నీవు ధరించ లేదె నా
కైన నరాకృతిం గొనెడు నంతటి దాక భవత్పదాంబుజ
ధ్యానము గల్గెనే దశరధాత్మజ దుఃఖవినాశ శ్రీహరీ


(వ్రాసిన తేదీ: 2013-1-28)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.