13, మార్చి 2013, బుధవారం

జరుగనీ నీ యిఛ్ఛ జగదీశ్వరా

జరుగనీ జరుగనీ జగదీశ్వరా
జరుగనీ నీ యిఛ్ఛ పరమేశ్వరా

పరమయోగిరాజగణవందితచరణా
వరదాయక సకలలోకపాలననిపుణా
నిరుపమానశుభవితరణకరుణాభరణా
పరాత్పరాక్తహృదయపద్మవిహరణా 

సకలజగంబులను నీవె చక్కగ చేసి
అకళంకస్థితినిల్పి యాదరముబెంచి
ఒకనాడు వాటిని నీ వుపసంహరించి 
ప్రకటింతువు శ్రీరామ పరమదివ్యలీల

భావింపగ నీ యంశనె పకృతిలోన పరచి
జీవుడనని నన్ను నీవె చేసినావు బలిమి
నీవే నేడీ యవిద్య నిన్నాళ్లకు విరచి
కావించినావు స్వస్వరూపావబోధ నెలమి

1 వ్యాఖ్య:

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.