28, మార్చి 2013, గురువారం

పాహి రామప్రభో - 061

కనుగొనుమా మహాత్మ  క్షణకాలము ముందర నిన్ను గూర్చి నా
మనసున నున్న భావముల మంచిపదంబుల చంపకంబులన్
గొని తనివార కూర్చుటకు కొంత ప్రయత్నము చేయ సిధ్దమై
తిని మరి యంతలో మరొక దిక్కున కేగెను బుధ్ధి రాఘవా!


(వ్రాసిన తేది: 2013-1-25 )

1 వ్యాఖ్య:

 1. ఏ దిక్కున బుద్ధి ఏగిన ఏమి శ్యామలీయ,
  అన్ని దిక్కులన్ నేనుంటిని !

  సర్వ దిక్కులున్ నావే !
  కనుమా ! ఆ పై బుద్ధి మాయం !

  తదైవ హృదయ కమలే మమ ఏవ తిష్టతి !


  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.