25, మార్చి 2013, సోమవారం

పాహి రామప్రభో - 058

శా. ఏ నిష్ఠా నియమంబు లే వ్రతము లే నెన్నండు కొంచెంబు గా
నైనం బూనక తప్పు చేసితిని రామా నన్ను మన్నించి యో
ధ్యానాతీతమహత్స్వరూప వరదా దాక్షిణ్యముం జూపి య
జ్ఞానంబున్ వెడలించి నిన్ను గొలువం సంసిధ్ధునిం జేయవే


(వ్రాసిన తేదీ:‌ 2013-1-23)

3 వ్యాఖ్యలు:

 1. అబ్బ, ఆశ, అప్పడం, వడ. ఏ పనీ చేయరు గానీ ధ్యానం, మహత్యం అన్నీ కావాలంటే ఎలా? ఇక్కడే భగవంతునికీ భక్తుడికీ వచ్చే చిక్కు. ఆయనేమో వీడికన్నీ ఇద్దాము అని అనుకుంటూ ఉంటాడు. వీడేమో 'నాకు తీరికేదీ' అనుకుంటూ ఉంటాడు. ఈ లోపున జీవితం అయిపోతుంది. పునరపి జననం పునరపి మరణం. ఎలాగ ఈ చిక్కు విడిపోయేది?

  గురూ గారూ ఏం చేద్దాం? :-)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మంచి ప్రశ్న.
   కాని మీరు పద్యాన్ని మరికొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి.
   అజ్ఞానం వల్ల భగవంతునియందు శ్రథ్థాభక్తులు కుదరవు.
   కాని భగవంతునికి అస్సలు అసాథ్యం ఉండదు కదా?
   ఆయన తలచుకుంటే, ఆ అజ్ఞానం కాస్తా యిట్టే పటాపంచలై పోదా?
   అప్పుడు వెంటనే ఆయన సేవకు జీవుడు సంసిథ్థుడు కాడా?
   మన ప్రయత్నం వలననే, మన ప్రజ్ఞ వలననే మనకు భగవత్తత్త్వంపైన శ్రథ్థాభక్తులు కలుగుతున్నాయా? లేదు కదా?
   అంతా ఆయన చలవే కాదా?

   తొలగించు
 2. నిజమేనండి.

  అదే భగవంతుడి వీక్నెస్. దాన్ని కొల్లగొట్టడమే మన పని. :-) మా గురువుగారు రాసినట్టు.

  "భగవంతుడా మనిద్దరం పందెం వేసుకుందాము. నేను నీ ముంగిట ఎన్ని యుగాలైనా కూర్చుంటాను నువ్వు ఛీదరించుకున్నా సరే. నువ్వు నన్ను అక్కున చేర్చుకోకుండా ఎంతకాలమైనా ఉండగలవా?" ... స్వామి సత్యానంద సరస్వతి."

  రమణ మహర్షి కూడా చెప్పేరు. అసలు భగవంతుడి మీద భక్తి ఉండాలంటే ఆయనే ఇవ్వాలట అది కూడా. బాగుంది కదా?

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.