20, మార్చి 2013, బుధవారం

పాహి రామప్రభో - 056

చం. నిశల వెలుంగు లల్లుకొను నేయమృతాంశుని కాంతి చేత నా
శశి శుభవృష్టి వృధ్ధియును సంక్షయముం గొనుచుండు నిత్యమున్
విశదయశోవిలాసి రఘువీరు దయామృత వృష్టి నిత్యమున్ 
దశదిశలేలు చుండు నిజదాసచకోరక పూర్ణచంద్రుడై


(వ్రాసిన తేదీ: 2013-1-23)

6 వ్యాఖ్యలు:

 1. ఇప్పటి వరకూ రాసిన పద్యాలలో కొన్ని చూసాను. ఇవి చందోబద్ధంగా రాసారు అని అనుకుంటున్నాను. కాని ఏ పద్యం ఎటువంటిదో తెలియట్లేదు (నాకు). అందుచేత మీరు పద్యం ముందు, చ, మ కం అనేవి రాస్తే నాలాంటి వాళ్లకు తెలుస్తుంది అవి చంపకమాలో, మత్తేభమో కందమో. అలా రాయగలరా?

  ధన్యవాదములు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. సరేనండీ. అలా వ్రాయటం సంప్రదాయమే‌ కూడాను. అందుచేత నాకేమీ అభ్యంతరం లేదు.
   ఈ 'పాహి రామప్రభో' శీర్షికతో వ్రాస్తున్నదంతా ఛందోబధ్దమైన పద్యకవిత్వమే.

   తొలగించు
  2. అన్ని పద్యాలకు మీరడిగిన వివరం‌ పొందుపరచాను. గమనించగలరు.

   తొలగించు

 2. శ్యామలీయం వారు, 'చందస్సు' ను చందో 'బద్దు' చేసేసేరన్న మాట !

  రామభద్రుడూ 'ఛందో' బంధమే?!


  చీర్స్

  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కాదమ్మా, రామచంద్రులవారు ఛందస్వరూపమైన రామాయణకథా నాయకులు. (ఛందమంటే వేదం అని అర్థంకదా!) అనగా రామకథయే‌ ఛందము.

   వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే।
   వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా॥

   వేదవేద్యుడైన పరాత్పరుడే రామచంద్రుడు. ఆయన కథాస్వరూపంగా వేదమే వాల్మీకిమహర్షినోట వెలవడింది.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.