31, మార్చి 2013, ఆదివారం

పాహి రామప్రభో - 064

తల్లియుదండ్రివై గురుడు దైవమ వీవయి రామచంద్ర యు
త్ఫుల్లసరోజనేత్ర పెడబుధ్ధుల జోలికి పోవకుండ నా
కెల్ల విధంబులన్ హితము నెప్పుడు జూపెదవయ్య నేను నీ
చల్లని నీడలో బ్రతికి చక్కగ నీ పదసీమ చేరెదన్


(వ్రాసిన తేదీ: 2013-1-27)

30, మార్చి 2013, శనివారం

పాహి రామప్రభో - 063

తల్లియు తండ్రియున్ గురుడ వీవయి రామచంద్ర యు
త్ఫుల్లసరోజనేత్ర పెడబుధ్ధుల జోలికి పోవకుండ నా
కెల్ల విధంబులన్ హితము నెప్పుడు జూపెద వయ్య నేను నీ
చల్లని నీడలో బ్రతికి చక్కగ నీ పదసీమ చేరెదన్


(వ్రాసిన తేదీ: 2013-1-27)

29, మార్చి 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 062

ఉ. శ్రీపతిదివ్యసన్నిధికి చేరగ నెంచు ముముక్షులార మీ
రే పగిదిన్ ప్రయత్నములన నెంతటి నిష్టను చేయుచున్న వా
రా పరమాత్మ రాఘవుని యందు తిరంబగు భక్తి  గల్గుచో
మీ పని చాల హాయి మరి మేలగు మార్గము లేదు భూమిపై


(వ్రాసిన తేదీ: 2013-1-25)

28, మార్చి 2013, గురువారం

పాహి రామప్రభో - 061

కనుగొనుమా మహాత్మ  క్షణకాలము ముందర నిన్ను గూర్చి నా
మనసున నున్న భావముల మంచిపదంబుల చంపకంబులన్
గొని తనివార కూర్చుటకు కొంత ప్రయత్నము చేయ సిధ్దమై
తిని మరి యంతలో మరొక దిక్కున కేగెను బుధ్ధి రాఘవా!


(వ్రాసిన తేది: 2013-1-25 )

27, మార్చి 2013, బుధవారం

షట్పదలు

తెలుగు ఛందస్సులలో‌ షట్పదల గురించి ముచ్చటించు కుందాం.  నిన్న శంకరాభరణం బ్లాగులో కొన్ని కుసుమషట్పదలు వ్రాసాను.  ఈ రోజు నా యీ శ్యామలీయం బ్లాగులో షట్పదల గురించి కొంచెం వివరించి వ్రాస్తే బాగుంటుందని అనిపించింది. 

షట్పదలు కన్నడదేశంలో చాలా ప్రసిథ్థం కానీ తెలుగులో వీటికి కావ్యప్రయోగగౌరవం శూన్యం. కన్నడంలో షట్పదలకు మాత్రలతోనే‌ కొలత. మన తెలుగు లాక్షణికులు మాత్రం దీన్ని దేశిగణాల్లో కొలిచారు.  ఈ షట్పదలు గేయరూపమైన ఛందస్సు. అందుచేత వీటి లక్షణాన్ని గణవిభజనతో‌ కాక మాత్రావిభజనతో చూడటం సముచితంగ ఉంటుంది.

కన్నడషట్పదలలో 10 రకాలున్నాయి. అవి (1)శరషట్పద, (2)కుసుమషట్పద, (3)భోగషట్పద, (4)భామినీషట్పద, (5)పరివర్థినీషట్పద, (6)వార్థకషట్పద (7)తలషట్పద (8)జలషట్పద (9)విషమషట్పద (10)ప్రౌఢషట్పద అనేవి. వీటి లక్షణాలు చూద్దాం

1. శరషట్పద
మాత్రా విభజన:
        4  +   4
        4   +  4
        4   +  4  +  4  +  2
        4  +   4
        4   +  4
        4   +  4  +  4  +  2

దీనికి ఒక ఉదాహరణ శ్రీశ్రీగారి కవిత్వం నుండి యిలా:

మరోప్రపంచం 
మరోప్రపంచం
మరోప్రపంచం పిలిచిందీ
పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాంపోదాం పైపైకీ

ముందే చెప్పుకున్నట్లు షట్పదులు గేయఛందస్సులు. ఈ మరోప్రపంచం గేయం మకుటం శరషట్పది కావటం జరిగిందిలా.  లేదా శ్రీశ్రీగారు భజగోవిందం ఆధారంగా వ్రాసారేమో?

భజగోవిందం
భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే స
న్నిహితే కాలే
నహినహి రక్షతి డుకృంకరణే


2. కుసుమషట్పద

మాత్రావిభజన:
        5  +   5
        5   +  5
        5   +  5  +  5  +  2
        5  +   5
        5   +  5
        5   +  5  +  5  +  2

౩. భోగషట్పద 

మాత్రావిభజన:
        3   +  3  +  3  +  3
        3   +  3  +  3  +  3
        3   +  3  +  3  +  3  +  3  +  3  +  2
        3   +  3  +  3  +  3
        3   +  3  +  3  +  3
        3   +  3  +  3  +  3  +  3  +  3  +  2

4. భామినీషట్పద

మాత్రావిభజన:
        3   +  4  +  3  +  4
        3   +  4  +  3  +  4
        3   +  4  +  3  +  4  +  3  +  4  +  2
        3   +  4  +  3  +  4
        3   +  4  +  3  +  4
        3   +  4  +  3  +  4  +  3  +  4  +  2


5. పరివర్థినీషట్పద

మాత్రావిభజన:
        4   +  4  +  4  +  4
        4   +  4  +  4  +  4
        4   +  4  +  4  +  4  +  4  +  4  +  2
        4   +  4  +  4  +  4
        4   +  4  +  4  +  4

        4   +  4  +  4  +  4  +  4  +  4  +   2


6. వార్థకషట్పద

మాత్రావిభజన:
        5   +  5  +  5  +  5
        5   +  5  +  5  +  5
        5   +  5  +  5  +  5  +  5  +  5  +  2
        5   +  5  +  5  +  5
        5   +  5  +  5  +  5
        5   +  5  +  5  +  5  +  5  +  5  +  2


ఉదాహరణ:
   లోకాలు కూలినా కూలిపో  నీవయ్య
   లోకేశు లందరూ తూలిపో నీవయ్య
   ఏకాకివై నీవు చిద్విలాసుండవై యుండేవు నారాయణా
   నీకన్న మాకెవ్వ రెక్కువే కాదయ్య
   నీ కటాక్షంబునే నమ్ముకున్నామయ్య
   శ్రీకామితాకార సద్భక్తమందార సర్వేశ నారాయణా

 
 


7. తలషట్పద

మాత్రావిభజన:
        3   +  3
        3   +  3
        3   +  3  +  3  +  2
        3   +  3
        3   +  3
        3   +  3  +  3  +  2


8. జలషట్పద 

మాత్రావిభజన: 
        3   +  4
        3   +  4
        3   +  4  +  3  +  2
        3   +  4
        3   +  4
        3   +  4  +  3  +  2
9.  విషమషట్పద

మాత్రావిభజన:
        4   +  5
        4   +  5
        4   +  5  +  4  +  5  +  2
        4   +  5
        4   +  5
        4   +  5  +  4  +  5  +  2

10. ప్రౌఢషట్పద

మాత్రావిభజన:
        4   +  5  +  4  +  5
        4   +  5  +  4  +  5
        4   +  5  +  4  +  5  +  4  +  5  +  2
        4   +  5  +  4  +  5
        4   +  5  +  4  +  5
        4   +  5  +  4  +  5  +  4  +  5  +  2


షట్పదులలో యతి నియమం గురించి:

షట్పదిలో యతి అవసరం లేదు. అప్పకవి యీ పద్యాన్ని నిర్యతి అనీ అనంతుడు దీన్ని 'వళ్ళు దొరగ' అనీ చెప్పారు.
కన్నండంలో యతి లేదు. తెలుగులో యతి నియమం లేని పద్యం యిదొక్కటే.


షట్పదులలో ప్రాస నియమం గురించి:
  
షట్పదలు 6 పాదాల పద్యాలే.  కాని తెలుగు లాక్షణికులు వీటిని 4 పాదాలుగా చేసారు!
ఇలా చేయటానికి వారు పొట్టిపాదాల జంటలను కలిపి ఒక్కో జంటనూ ఒక్కో పాదంగా చూపారు.
ఆ పైన ప్రాస నియమం యధావిధిగా వడ్డించారు.
ఇలా 6 పాదాలనూ కలిపి 4 చేసిన విధానం చూసి రావూరి దొరస్వామి శర్మగారు వీళ్ళకి షట్పద సరిగా తెలియలేదని ఆక్షేపించారు.

గమనిక:  ఈ వ్యాసం ప్రస్తుతానికి అసంపూర్ణం. ఎందుకంటే చాలా షట్పదావిశేషాలకు ఉదాహరణలు ఇంకా ఇవ్వవలసి ఉంది కాబట్టి. పైగా మరికొన్ని విషయాలు ఇంకా వ్రాయవలసి ఉంది కూడా.

ఆధారగ్రంధం:  
   తెలుగులో దేశిఛ్ఛందస్సు ప్రారంభ వికాస దశలు - డా॥సంగనభట్ల నరసయ్యగారు.  (ద్వితీయముద్రణ)

పాహి రామప్రభో - 060

శ్రీకర నిన్ను గొల్చుటకు చిత్తము సుస్థిరశాంతియుక్తమై
లేకునికిం పురాకృతము లీలగ నిట్టటు త్రోయుచుండగా
శోకనిమగ్నబుధ్ధినయి సొక్కుచు లోకపు పాడునూతిలో
భేకము రీతి నుంటి రఘువీర కృపాకర కావరావయా


(వ్రాసిన తేదీ: 2013-1-24)

26, మార్చి 2013, మంగళవారం

పాహి రామప్రభో - 059

ఉ. బంగరు లేడి యుండదని బాగుగ సీత యెఱుంగ లేదె తా
వెంగలి యేమి రాఘవుడు వెంబడి పోవగ దాని జూచి మీ
దం గలుగంగ నైన కథ దానవనాశన మన్నమాట నా
యింగితహీనదస్యపతి యేమి యెఱుంగమి రామలీలయే


(వ్రాసిన తేదీ: 2013-1-24)

25, మార్చి 2013, సోమవారం

పాహి రామప్రభో - 058

శా. ఏ నిష్ఠా నియమంబు లే వ్రతము లే నెన్నండు కొంచెంబు గా
నైనం బూనక తప్పు చేసితిని రామా నన్ను మన్నించి యో
ధ్యానాతీతమహత్స్వరూప వరదా దాక్షిణ్యముం జూపి య
జ్ఞానంబున్ వెడలించి నిన్ను గొలువం సంసిధ్ధునిం జేయవే


(వ్రాసిన తేదీ:‌ 2013-1-23)

21, మార్చి 2013, గురువారం

పాహి రామప్రభో - 057

ఉ. సీతను గొంచు బోయినను చేరి పదంబులు పట్టి మ్రొక్కుచో
నాతనికే నయోధ్య కడు నాదర మెప్పగ నిత్తునన్న వి
ఖ్యాతదయాసముద్ర నిను గాక మరొక్కని చూడబోమయా
భూతలవాసులందు సరి పోలెడు వానిని రామ భూవరా


(వ్రాసిన తేదీ: 2013-1-23)

20, మార్చి 2013, బుధవారం

పాహి రామప్రభో - 056

చం. నిశల వెలుంగు లల్లుకొను నేయమృతాంశుని కాంతి చేత నా
శశి శుభవృష్టి వృధ్ధియును సంక్షయముం గొనుచుండు నిత్యమున్
విశదయశోవిలాసి రఘువీరు దయామృత వృష్టి నిత్యమున్ 
దశదిశలేలు చుండు నిజదాసచకోరక పూర్ణచంద్రుడై


(వ్రాసిన తేదీ: 2013-1-23)

19, మార్చి 2013, మంగళవారం

పాహి రామప్రభో - 055

చం. భరతుడు వచ్చి పాదుకలు పట్టుక పోయెను కాననంబులన్
తిరుగుట యింక నెట్టులని దేవ యొకించుక సంశయింతువో
నరకపరీక్ష లోర్చినది నాదగు చర్మము దీని పాదుకల్
మరియు ప్రశస్త మేమి యను మానము లేక గ్రహించవే ప్రభూ


(వ్రాసిన తేదీ: 2013-1-23)

18, మార్చి 2013, సోమవారం

పాహి రామప్రభో - 054

కం. కైకమ్మ లాగికొనుచో
నీకొక గద్దియకు కలుగ నిత్తునె లోపం
బో కాకుత్స్థ కృపామయ
చేకొనుమా నాదు హృదయ సింహాసనమున్


(వ్రాసిన తేదీ: 2013-1-23)

17, మార్చి 2013, ఆదివారం

పాహి రామప్రభో - 053

మ. వనవాసంబు నెపంబు జేసికొని నా స్వామీ జగద్వంద్య నీ
ఘనకోదండవిముక్తదివ్యశరసంఘాతంబులన్ సర్వదై
త్యనికాయంబును సంహరించితివి ధాత్రిన్ ధర్మమూర్తీ జగ
జ్జనసంరక్షక రామచంద్ర ఖగరాట్సంచార సర్వేశ్వరా


(వ్రాసిన తేదీ: 2013-123)

16, మార్చి 2013, శనివారం

ఎరుక లేని వారితో ఇరుకైన లోకమిది

నరలోక మనుదాని నాణ్యత ట్టిది
ఎరుక లేని వారితో రుకైన లోకమిది

రి కేమి కావాలో ఎవరికీ తెలిదు
రి బ్తుకు తీరుతెన్ను లెరికీ తెలిదు 
రి కేది ప్రాప్మో ఎరిగే దారీ లేదు 
రి దురాశాఫలం ఎరికీ తెలిదు

హం కాసుకై అలటిచు బ్తుకులు
హపరాల మర్మాలు రుగ లేని బ్రతుకులు
కుహనాప్రేమలమధ్య కునారిల్లు బ్రతుకులు
సహజీవనమాధుర్యపు చవి మరచిన బ్రతుకులు 

గాలిలోని ఒక దుమ్ముకణం వంటి వాడే
ఈ లోకప్రవాహంలో‌ ఈదే‌ ప్రతివాడు
ఏల తానుంటిని ఎటుబోవుచుంటినని
ఆలోచించే ఓపిక అసలు లేనివాడు

పొరబాటున వరైనా పొడగాంచి సత్యమిదని
రుకపరచ బోదురా గిరి నవ్వు వారిని
పరమేశ ఇతరు లెవరు బాగుచేయ లేరని
రిగి దూరముండురా రుకగలుగువాడు