17, అక్టోబర్ 2012, బుధవారం

నే నుంటిని నీ నిజభక్తునిగ

నే నుంటిని నీ నిజభక్తునిగ
కానుంటిని నిను కలిసి యొక్కటిగ


పూనిక మరల మరల ప్రకృతిని 
    పుట్టించెదవు పురుషోత్తమ నను
మానక మరల మరల మన సంగతిని 
    మననము చేయుచు మనెదను నేను
నేనిట నీవట నుంటిమి గాని
    నే నెరుగుదు మన మిర్వుర మొకటని 


సరి సరి యీకర చరణంబులచే
    జరిగెడు నవియా జన్మకారణములు
రి యటులగుచో పరమాత్మా యే
    పొరబాటునకా మొదటి జన్మ మది
జరిగిన దేదో జరిగిన దైనను
    పొరి నా తొలిరూ‌పుగ నిన్నెరిగితి 


వెనుకటి జన్మలు నే నెరుగనయా
    వెనుబలమవు నీ‌ వని యెరిగితిని
మును రానున్నది నే నెరుగనయా
    మునుకొని నిన్నే  పూజించితిని
నఘా మన మొకటని నే నెరిగితి
    వినుము విచారము వీడి యుంటినివ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.