15, సెప్టెంబర్ 2012, శనివారం

ఓ శరీరమా నన్నేల బంధించితివి

ఓ శరీరమా నన్నేల బంధించితివి
దోసమెంచక నీవు మోసగించితివి

ఇలను చూడ వచ్చినే నిచట చిక్కుపడితిని
కలిగిన యీ‌ భవము నుండి తొలగ లే నైతిని 
పలుచ నైన యీ సుఖానుభవము నా కెందుకు
వలచి యీ ఆత్మ నేల పట్టి బంధించితివి

ఈ నీ కపటేంద్రియంబు లేపాటి రజ్జువులు 
పోనీ నీ మమతల వల పొంక మేపాటిది
నే నా శాశ్వతుడను నీవా మూణ్ణాళ్ళ కలవు
నా నిజ తత్వమును తెలియ నట్టి యజ్ఞానివి

నీకు నాకు లడాయి నీ తోడనె మొదలాయె
నాకు నీ‌ బడాయి నాటి నుండి యెరుకాయె
నీ కట్టడి చెల్లదని నీ వెరుగుట మంచిది
నాకు విశ్వవిభునకు నేకత్వము నెరుగుము6 వ్యాఖ్యలు:

 1. శరీరం బంధించకపోతే మనసెటుపోతుందండి:)

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. మంచి ప్రశ్న వేశారు.
   ఇక్కడ శరీరం అంటే ఉపాధి.
   ఉపాధి బంధనాలనుండి విడివడటం అంటే విదేహస్థితి.
   ప్రకృతి కూడా లయమై పోతుంది కాబట్టి దేశకాలాదులు కూడా ఉండవు.
   ఆ స్థితిలో కేవలం కేవలం ఆనందస్వరూపుడై ఉండటం జరుగుతుంది.
   అనన్యమైన ఆ కైవల్య స్థితిలో కేవల పరబ్రహ్మస్వరూపుడైన తనకు అన్యమైన దేశకాలాలు అన్యమైన వస్తువులూ ఏమీ‌ ఉండవు. ఎక్కడికీ పోవటం అన్న ప్రశ్నయే ఉదయించదు.

   తొలగించు
 2. శ్యామలీయా,

  నేను నిన్ను బంధించ లేదయా
  నీవే నేనను కుంటున్నావు
  నేను నీవు కాదు, నీవు నీవే,
  అని శరీరం జవాబు చెప్తోందండీ శ్యామలీయం వారు.

  చీర్స్
  జిలేబి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

  లాస్య రామకృష్ణ
  బ్లాగ్ లోకం

  ప్రత్యుత్తరంతొలగించు
 4. బంధాలు కష్టమే...చిత్రం వాటిని వదులుకోనూ లేము
  చాలా బాగా వ్రాసారు

  ప్రత్యుత్తరంతొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.